నా రియల్ లైఫ్ భర్త కంటే.. రీల్ లైఫ్ భర్తతోనే ఎక్కువ సమయం గడిపా: అనుష్క శర్మ చమత్కారం

  • కోహ్లీ, నేను చాలా బిజీగా ఉన్నాం
  • కలిసి గడిపేందుకు ఎక్కువ సమయం దొరకడం లేదు
  • 'సూయీ ధాగా' చిత్రం వల్ల ఓ గృహిణి ఎలా ఉండాలో నేర్చుకున్నా
వరుస క్రికెట్ సిరీస్ లతో విరాట్ కోహ్లీ, బాలీవుడ్ సినిమాలతో అనుష్క శర్మలు ఎప్పుడూ ఊపిరి సలపనంత బిజీగా ఉంటారు. వీరిద్దరూ కలసి గడపడానికి ఎక్కువ సమయం కూడా దొరకదు. ఇదే విషయాన్ని అనుష్క శర్మ స్పష్టంగా చెప్పింది. అనుష్క నటించిన 'సూయీ ధాగా' చిత్రంలో హీరో వరుణ్ ధావన్ కు భార్యగా అనుష్క నటించింది. ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ సందర్భంగా అనుష్క మాట్లాడుతూ, నా రియల్ లైఫ్ భర్త కంటే రీల్ లైఫ్ భర్తతోనే ఎక్కువ సమయం గడిపానని చమత్కరించింది.

పదిహేనేళ్ల వయసు నుంచే తాను సంపాదిస్తున్నానని, కోహ్లీని పెళ్లాడిన తర్వాత కూడా తన వృత్తిని కొనసాగిస్తున్నానని అనుష్క తెలిపింది. ఇద్దరం ఎంతో బిజీగా ఉండటం వల్ల, కలసి గడిపే సమయం తక్కువని చెప్పింది. ఈ సినిమా ద్వారా ఓ గృహిణి ఎలా ఉండాలో నేర్చుకున్నానని తెలిపింది.
Go Back to Shorts
Anushka Sharma
Virat Kohli
sui dhaga
bollywood

More Telugu News